వరి అక్రమ సాగుదారులపై చర్యలు తప్పవు: ఏఈ

నవతెలంగాణ – గోవిందరావుపేట

లక్నవరం చెరువు కోట కాలువ పారకం సందర్భంగా  అక్రమ సాగు చేస్తున్న రైతులపై చర్యలు తప్పవని ఏఈ హర్షద్ అన్నారు. సోమవారం మండలంలోని లక్నవరం రభి సాగు కోట కాలువ అక్రమ సాగు రైతులకు ఏఈ హర్షద్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా అర్షద్ మాట్లాడుతూ 19 /12/ 23 న లక్నవరం చెరువు రబీ తైబందీ లో భాగంగా కోట కాలువ కింద 1900 ఎకరాలకు సాగునీరు ఇచ్చే విధంగా తీర్మానించడం జరిగిందని అన్నారు. కోట కాలువ సాగు క్రమంలో అర్హత లేని రైతులు కొంతమంది మోటార్ల ద్వారా ఇతర పద్ధతుల ద్వారా అక్రమంగా వరి సాగు చేస్తూ నీటి చౌర్యానికి పాల్పడుతున్నారని అన్నారు. ముందు ముందు నీరంధక లక్నవరం చెరువు కోట కాలువ ఆయకట్టు పంటలు ఎండిపోతే అక్రమ సాగు రైతులే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. అక్రమ సాగు అరికట్టడంలో భాగంగా అట్టి రైతుల మోటార్లు పంపు భాగాలను  స్టార్టర్లను పైపులను జప్తు చేయడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా అక్రమ సాగు రైతులు అవగాహన పెంచుకొని సక్రమంగా కోట కాలువ ఆయకట్టు రైతాంగానికి  నీరు అందేలా సహకరించాలని కోరారు. లేనియెడల చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఈ హర్షద్ తోపాటు పలువురు కోట కాలువ ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.