
నవతెలంగాణ – భువనగిరి రూరల్
జిల్లాలోని గిరిజన విద్యార్ధినీ విద్యార్ధులకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్ (రామంతపూర్ & బేగంపేట) 1వ తరగతి ఇంగ్లీస్ మీడియంలలో ప్రవేశము కొరకు అర్హులైన విద్యార్ధినీ విద్యార్ధుల దరఖాస్తులు కోరబడుచున్నాయని జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్ధులకు కావలిసిన అర్హతలు పుట్టిన తేదీ: 01.06. 2017 నుండి 31.05.2018 లోపు జన్మించి, మున్సిపల్/తశీల్దార్ ద్వారా జారీ చేయబడి ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయము రూరల్ (గ్రామీణ) ప్రాంతాల వారికి రూ.1,50,000/- అలాగే అర్బన్ (పట్టణ) ప్రాంతాల వారికి రూ.2,00,000/- మించరాదు. కుల దృవీకరణ పత్రము సంబందిత తశీల్దార్ ద్వారా జారీ చేయబడి ఉండవలెను. (ఆధార్ మరియు రేషన్ కార్డ్లు జిరాక్స్ కాపీలు జతచేయవలెను). 11 మార్చ్ 2024 లోపు దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 14వ తేదీన లాటరీ డ్రా, జిల్లా కలెక్టర్ యదాద్రి భువనగిరి గారి ఆధ్వర్యంలో డ్రా తీయబడును. అర్హులైన విద్యార్థినీ, విద్యార్థులు దరఖాస్తు ఫారములను జిల్లా గిరిజన అభివృద్ది అధికారి యాదాద్రి భువనగిరి కార్యాలయము నుండి ఉచితముగా పొంది పూర్తి వివరములతో చివరి తేది. 11.03.2024 సా. 05-00 గంటల లోపు జిల్లా గిరిజన అభివృద్ది అధికారి కార్యాలయము, యదాద్రి భువనగిరి వారికి (2) పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో సమర్పించాలి. తదుపరి అందిన దరఖాస్తులు స్వీకరించబడవు. పూర్తి వివరములకు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయము 7096723285, 9849704132, 8688098359 కి ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు.