చికిత్స పొందుతూ అండర్ ట్రయల్ ఖైది మృతి 

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా జైలులో అండర్ ట్రయల్ ఖైదీ తిరుమలయ్య సోమవారం చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందాడు. గత ఏడు నెలలుగా నిజామాబాద్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం చద్మల్ గుట్ట ఎర్రమన్ను కుచ్చ ప్రాంతంకు చెందిన తిరుమలయ్య (28) చోరీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే సోమవారం అనగా తేదీ 4 మార్చ్ 2024న తెల్లవారుజామున అతనికి గుండెపోటు రావడం జరిగిందని వెంటనే జైలు సిబ్బంది తిరుమలయ్యను జైలు అధికారులు జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు అని తెలిసింది.