
మండల కేంద్రంలోని శ్రీ కాలభైరవ స్వామి దేవస్థాన ఆవరణలో సోమవారం రూ.5 లక్షల జిల్లా పరిషత్ నిధులతో సీసీ రోడ్డు పనులను జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పనులను కాంగ్రెస్ నాయకులు, కాలభైరవ స్వామి సిబ్బంది ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ… ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని సూచించిన మదన్ మోహన్ రావుకు, నిధులను కేటాయించిన జెడ్పిటిసి మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రభు రామచంద్రం, సొసైటీ డైరెక్టర్ లక్ష్మా గౌడ్, ఆలయ సిబ్బంది సురేందర్, కాంగ్రెస్ నాయకులు వడ్ల లక్ష్మీరాజం, తూర్పు సుబ్బయ్య, అంబాయి ప్రసాద్, నామాల రవి, పరశురాం తదితరులు పాల్గొన్నారు.