ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రం ప్రారంభం

నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా పాలన సేవా కేంద్రాన్ని సోమవారం ఎంపీడీవో సవితా రెడ్డి, ఎంపీడీవో కార్యాలయం సిబ్బందితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాపాలనలో భాగంగా గృహ జ్యోతిలో 200 యూనిట్ల విద్యుత్ కంటే తక్కువ వినియోగించించిన వారికి సబ్సిడీ అందనివారు, తెల్ల రేషన్ కార్డు ఉండి గృహలక్ష్మి క్రింద సబ్సిడీ సిలిండర్ రానివారికి సేవ కేంద్రంలో,  సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.