ఘనంగా భ్రమరాంబకేతమ్మ మల్లికార్జునస్వామి కళ్యాణ వేడుకలు

– అన్నదాన కార్యక్రమం నిర్వహించిన మాజీ ఎంపీపీ తోటకూర వెంకటేష్ యాదవ్
నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
భువనగిరి మండలంలోని హన్మాపురం గ్రామంలో సోమవారం శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణము, శ్రీ భ్రమరాంబ కేతమ్మ  సమేత మల్లికార్జున స్వామి కళ్యాణ  వేడుకలను అంగరంగ వైభవంగా  ఘనంగా నిర్వహించారు. కీర్తిశేషులు తోటకూరి బాలకృష్ణ యాదవ్, తోటకూరి మల్లమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు, కోడలు  మాజీ ఎంపీపీ తోటకూర వెంకటేష్ యాదవ్, తోటకూర విజయలక్ష్మి యాదవ్  అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాట్లాడారు. హన్మపురం గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణం, శ్రీ భ్రమరాంబ కేతమ్మ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయని ప్రతి సంవత్సరం ఈ విధంగానే నిర్వహిస్తున్నారని తెలిపారు. తనకు అన్నదాన కార్యక్రమం చేయడం ఎంతో ఆనందమని, ఆధ్యాత్మిక సేవలో గ్రామస్తుల కోసం తగిన సహకారం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీపీ నారాల నిర్మల వెంకటస్వామి యాదవ్, వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు  ఎలిమినేటి   కృష్ణారెడ్డి, డాక్టర్ ఎర్రబోయిన నర్సింగరావు, ఎర్రబోయిన రాజు,  ఎర్రబోయిన రమేష్ యాదవ్, తుమ్మేటి వెంకటేష్ యాదవ్, నాయన గణేష్, రేపాక కృష్ణ యాదవ్, జ్ఞానేశ్వర్ యాదవ్ ఎర్రబోయిన కొండల్ , భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.