
యాదగిరిగుట్ట కొండపైన మీడియా పాయింట్, మీడియా గదులను ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ హనుమంతు కె జండగే కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గందమల రాజు, ప్రధాన కార్యదర్శి శివ, ఉపాధ్యక్షులు గుజ్జ నరేష్, కోశాధికారి రాజు, సభ్యులు నరసింహ పాల్గొన్నారు.