అక్రమ ఇసుక వాహనాల పట్టివేత..

– మోయతుమ్మెద వాగులో  టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి 
నవతెలంగాణ – బెజ్జంకి
విశ్వసనీయ సమాచారం మేరకు మోయతుమ్మెద వాగులో అక్రమంగా ఇసుక రవాణ చేస్తున్న వాహనాలపై సోమవార టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేసి వాహనాలను పట్టుకున్నారు. అక్రమ ఇసుక,రేషన్ బియ్యం తరలింపు,మత్తు పదార్థాలను కలిగియున్న,విక్రయించిన చట్టపరమైన చర్యలు తప్పవని టాస్క్ ఫోర్స్ అధికారులు హెచ్చరించారు.ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే 8712667446, 8712667447  నంబర్లకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.
మరో రెండు ట్రాక్టర్ల పట్టివేత:  మండలంలోని గాగీల్లపూర్ గ్రామ శివారులోని మోయతుమ్మెద వాగు నుండి అనుమతుల పేరునా అక్రమంగా ఇసుక రవాణ చేస్తున్న మరో రెండు ట్రాక్టర్లను బ్లూ కోల్ట్ పోలీసులు పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.పట్టుకున్న మూడు వాహనాలపై కేసులు నమోదు చేశామని ఏఎస్ఐ శంకర్ రావు తెలిపారు.
తేదీలు మార్చుకుంటూ: ప్రభుత్వ అభివృద్ధి నిర్మాణ పనుల కోసం తహసిల్దార్ ఇసుక రవాణకు అనుమతులు జారీ చేసి శనివారం రోజున బదిలీపై వేళ్లారు.ఇసుక వాహనాల యాజమానులు తహసీల్ కార్యలయంలోని ఓ అధికారి అండతో శనివారం జారీ చేసిన అనుమతులను రవాణదారులు సోమవారానికి మార్చించుకుని అనుమతుల పేరునా అక్రమ ఇసుక రవాణకు తెరలేపారంటూ ఇసుక రవాణదారుల్లో ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి.అధికారి జారీ చేసిన అనుమతులను కార్యలయ సిబ్బంది మార్పు చేసినట్టు వచ్చిన ఆరోపణలపై నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసిల్దార్  కఠినంగా వ్యవహరిస్తేనే ప్రభుత్వంపై గౌరవం నిలబడుతుందని రవాణదారులు వాపోతున్నారు.