కేసీఆర్ బహిరంగ సభ విజయవంతం చేయాలి: మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
ఈనెల 12న కరీంనగర్ లో జరిగే కేసీఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ.. కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్ లో జరిగే కరీంనగర్ పార్లమెంట్ పరిధి భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలను తరలించాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్  గెలుపు కోసం అందరం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అన్వర్, మండల అధ్యక్షుడు వంగ వెంకట్ రామిరెడ్డి, మహిళ ప్రజాప్రతినిధులు , పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.