మళ్లీ ఓడిన హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌

– ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ 2024
చెన్నై: ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌లో హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ మరో పరాజయం చవిచూసింది. సోమవారం చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూర్‌ టార్పెడోస్‌ చేతిలో 6-15, 11-15, 12-15తో హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ వరుస సెట్లలో ఓటమి పాలైంది. గ్రూప్‌ దశలో ఏడు మ్యాచుల్లో ఆరింట ఓడిన బ్లాక్‌హాక్స్‌ ‘సూపర్‌ 5’ రేసు నుంచి నిష్క్రమించింది!. బ్లాక్‌హాక్స్‌ ఆటగాళ్లలో సాహిల్‌, జోసెఫ్‌, హేమంత్‌ రాణించగా.. బెంగళూర్‌ ఆటగాడు సేతు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.