తరాలు గుర్తుంచుకునే సినిమా

సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్‌ బ్యానర్‌ పై వేణుగోపాల్‌ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘లగ్గం’. ‘భీమదేవరపల్లి బ్రాంచి’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్‌ చెప్పాల ఈ సినిమాకు రచన-దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ‘మన తెలుగు సంప్రదాయంలోని తెలంగాణ పెళ్లిని కన్నుల విందుగా చూపించబోతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు’ అని దర్శకుడు రమేష్‌ చెప్పాల అన్నారు. ‘కొత్త అనుభుతిని కళ్ళముందు ఉంచేలా ఈ చిత్రం ఉంటుంది. కొన్ని తరాలు గుర్తుంచుకునే చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది’ అని నిర్మాత వేణుగోపాల్‌ రెడ్డి చెప్పారు. ‘ఇది వరకు తెలుగు సాంప్రదాయంలో జరిగే పెళ్లి కాన్సెప్ట్‌తో చాలా చిత్రాలు వచ్చాయి. అందుకు భిన్నంగా ఈ సినిమా ఉండనుంది. తెలంగాణదనం ఉట్టిపడే విధంగా దర్శకులు రమేష్‌ చెప్పాల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు’ అని రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. రోహిణి మాట్లాడుతూ,’రచయిత-దర్శకుడు రమేష్‌ చెప్పాల అన్ని హంగులతో లగ్గం యూనివర్స్‌ను క్రియేట్‌ చేయబోతున్నారు’ అని చెప్పారు. సాయి రోనాక్‌, ప్రగ్యా నగ్రా హీరో, హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఎల్‌.బి శ్రీరామ్‌, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:చరణ్‌ అర్జున్‌, ఎడిటర్‌: బొంతల నాగేశ్వర రెడ్డి, కెమెరామెన్‌: బాల్‌ రెడ్డి, ఆర్ట్‌:కష్ణ, సాహిత్యం: కాసర్ల శ్యామ్‌.