వేల్పూర్ మండల కేంద్రంలో ఒకేసారి నాలుగు ఇళ్లల్లో చోరీ

నవతెలంగాణ – (వేల్పూర్) ఆర్మూర్ 

 మండల కేంద్రంలోని  ఒకేరోజు రాత్రి నాలుగు ఇళ్లల్లో దొంగల బీభత్సం చేసి దొంగతనాలకు పాల్పడ్డారు.. తాళాలు వేసి ఉన్న ఒంటరి ఇళ్లను  టార్గెట్ చేస్తూ వరుస దొంగతనాలకు పాల్పడ్డా ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.. మండల కేంద్రంలోని సోమవారం అర్ధరాత్రి ఎస్సీ  వార్డ్ లో ఉన్న సుర్బిరియాల  శారద అనే మహిళ శివరాత్రికి వేములవాడ రాజన్న దర్శనానికి కొరకు జమ చేసుకున్న డబ్బులు పదివేల రూపాయల నగదు ,మూడు గ్రాముల  బంగారం, 20 తులాల వెండి కడియాలు దొంగిలించడం జరిగిందని తెలిపారు. ముదిరాజ్ గౌరాయి నర్సయ్య  వారి బంధువులు రామన్నపేటలో చనిపోయిన వారింటికి వెళ్ళగా తాళం వేసి ఉన్న తాళం , బీరువా తాళాలు కూడా పగలగొట్టి నానా బీభత్సం సృష్టించరు… అల్లూరి చిన్న రాజేశ్వర్ వాళ్ళ ఇంట్లో ఉన్న రాజు కిరాణా షాప్  యజమాని రాజు తన తల్లి ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ వెళ్ళినందుకు  కిరాణా షాప్ తాళం పగలగొట్టి గల్ల పెట్టెలో నుంచి సుమారు నాలుగు వేల రూపాయలు చిల్లర డబ్బులు దొంగిలించరు అని తెలిపారు . బద్దం రాజేశ్వర్  వారి పాత ఇంట్లో కూలీ మనుషులు కిరాయి ఉన్నఇంటి తాళం పగలగొట్టి సామాగ్రిని చిందరవందర  చేశారు. ఒకే రోజు ఒకే రాత్రిలో నాలుగు ఇళ్లల్లో  చోరికి పాల్పడడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు… మండల కేంద్రంలో కూత వేట దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ దొంగలు బీభత్సాల్ సృష్టించడంతో ప్రజలలో ఆందోళన చెందుతున్నారు…. మండల కేంద్రంలోనే పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి ఇటువంటివి మళ్లీ జరగకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.