
నవతెలంగాణ – కంటేశ్వర్
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరిపితే భారతదేశంలో బహుజన శ్రామిక మహిళా స్వయంగౌరవ దినోత్సవంగా జరపాలని బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రోడ్లు భవనాల అతిథి గృహంలో బహుజన లెఫ్ట్ మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాట చేసిన సమావేశంలో సబ్బని లతా మాట్లాడుతూ..ప్రపంచవ్యాప్తంగా మహిళలు శ్రమ దోపిడికి వ్యతిరేకంగా ఉద్యమిస్తే భారతదేశంలో కుల దోపిడికి వ్యతిరేకంగా వర్గ దోపిడికి వ్యతిరేకంగా ఛత్రపతి జీజావ్, సావిత్రమ్మ ఫూలే , శేఖ్ ఫాతిమా, రమా అంబేడ్కర్, చాకలి ఐలమ్మ ఘల్కారీ బాయి లాంటి బహుజన మాతృమూర్తులు వీరోచిత పోరాటాల ద్వారా భారతీయ చరిత్రను నిర్మించారని కొనియాడారు. ఈరోజు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వం కారణంగా మహిళలపై రోజురోజుకూ జరుగుతున్న లైంగిక దాడులు , అత్యాచారాలు ఆందోళన కలిగిస్తోంది ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల సమస్యలపై మహిళలే కాకుండా అభ్యుదయ వాదులైనపురుషులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి దండు జ్యోతి జిల్లా ఉపాధ్యక్షురాలు ఆకుల సుజాత,లావణ్య. స్వాతి. శైలజ. గంగా, నీలా వర్ష, లక్ష్మీ పాల్గొన్నారు.