జనంలోకి రండి.. కన్న వాళ్లతో కలిసి ప్రశాంతంగా జీవించండి: సీఐ వి శంకర్

నవతెలంగాణ – గోవిందరావుపేట
మావోయిస్టు సోదరులారా వనం వీడి జనంలోకి రండి కన్నా వాళ్లతో కలిసి ప్రశాంతంగా జీవించండి అని పసర సి ఐ వి శంకర్ అన్నారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాలలో మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలవాలని తెలియజేసే గోడపత్రికలను ఎస్ఐ ఎస్.కె మస్తాన్ మరియు సిబ్బందితో కలిసి అంటించి ప్రజలతో మాట్లాడారు. మావోయిస్టు లు తమ హింస సిద్ధాంతాలు వదిలేసి వనం వీడి జనం లోకి వచ్చి తమ కుటుంబ సభ్యుల తో సంతోషంగా గడపాలని పిలుపునిచ్చారు.అజ్ఞాతంలో ఉన్న  మావోయిస్టులు అందరూ జనజీవన స్రవంతిలో రావాలని, లొంగిపోయిన మావోయిస్టులకు పోలీసులుప్రభుత్వం తరఫున  సరైన సహాయం అందిస్తామని తెలియచేసారు. జనజీవన స్రవంతిలోకి వచ్చి కన్నవాళ్ళతో భార్యా పిల్లలతో కలిసి జీవిస్తూ సమాజాభివృద్ధికి తోడ్పడాలని అన్నారు.