నయా క్రైమ్‌ ధ్రిల్లర్‌

విన్‌ క్లౌడ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, శ్రీ లక్ష్మీ పిక్చర్స్‌ పతాకంపై జీరో ప్రొడక్షన్స్‌ సమర్పిస్తున్న తాజా చిత్రం ‘మాయ’. రాజేష్‌ గొరిజవోలు నిర్మాణ సారథ్యంలో రమేష్‌ నాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ అత్యంత ఘనంగా జరిగింది. హీరో కిరణ్‌ ఆవల మాట్లాడుతూ,’డైరెక్టర్‌ రమేష్‌ నాని ఈ స్టోరీ చెప్పినప్పుడు సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగింది. సినిమా ప్రివ్యూ వేసినప్పుడు నా నమ్మకం నిజమైంది. ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌ ప్రాణం పెట్టి కంపోజ్‌ చేశారు. నా తదుపరి మూవీ కూడా వీళ్ళకే ఇస్తున్నాను. నిర్మాత రాజేష్‌ ఎంతో ఉత్సాహంతో, ఎంతో నమ్మకంతో పెట్టుబడి పెట్టారు’ అని అన్నారు. ‘రమేష్‌ ఈ కథ చెప్పినప్పుడు ఇలాంటి కథ ఖచ్చితంగా మెటీరియలైజ్డ్‌ కావాలని.. బడ్జెట్‌ గురించి ఆలోచించకండి అని చెప్పాను. హీరోయిన్‌ ఎస్తర్‌ రావడం ఈ సినిమాకి ప్రధాన బలం. ఆ తర్వాత ఎంతో అనుభవం ఉన్న సురేష్‌ కొండేటి చేరడం అదనపు బలంగా మారింది. వీటన్నింటికీ మించి డిస్ట్రిబ్యూటర్‌ బాపిరాజు మా సినిమాను తీసుకోవడం అనేది విజయంగా భావిస్తున్నాం’ అని నిర్మాత రాజేష్‌ అన్నారు. ‘ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి ముఖ్య కారణం ప్రొడ్యూసర్‌ రాజేష్‌. సినిమా అవుట్‌ఫుట్‌ బాగా వచ్చింది. కచ్చితంగా అందర్నీ బాగా అలరిస్తుంది’ అని అని డైరెక్టర్‌ రమేష్‌ చెప్పారు. ఎస్తర్‌ మాట్లాడుతూ,’ఇది క్రైమ్‌ స్టోరీ అయినప్పటికీ సినిమాలో ఎమోషన్‌ సీన్స్‌ అద్భుతంగా ఉన్నాయి. ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు.