పాస్‌ చేస్తే.. గొప్ప సినిమాలు తీస్తా

పాన్‌ఇండియా మూవీ ‘రికార్డ్‌ బ్రేక్‌’ ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
కథ మీద నమ్మకం
‘బిచ్చగాడు’ వంటి సినిమా నిర్మించిన తర్వాత కంటెంట్‌ ఉంటే ప్రేక్షకులు ఏ సినిమానైనా సక్సెస్‌ చేస్తారనిపించింది. అందుకే ప్రజలు మనసుకి హత్తుకునే విధంగా, నిజానికి దగ్గరగా నమ్మకంతో చాలా ఖర్చు పెట్టి ఈ సినిమాని నిర్మించాం. ట్రైలర్‌ రిలీజ్‌ అయినప్పుడు వచ్చిన రెస్పాన్స్‌, అలాగే మీడియాకు వేసిన షోలో వచ్చిన రెస్పాన్స్‌ చూసి మా సినిమాకి ‘రికార్డ్‌ బ్రేక్‌’ యాప్ట్‌ టైటిల్‌ అని అందరూ అన్నారు. సినిమా రిలీజ్‌ అయ్యాక ప్రేక్షకులు కూడా అదే ఫీల్‌ అవుతారు. ప్రజెంట్‌ ఉన్న హీరోల్లో అంత బాడీ ఉన్నవాళ్లు వెయిట్‌ పుటప్‌ చేయగలిగిన వాళ్లు ఎవరూ లేరు. అప్పటి కాలానికి రామారావు, కష్ణంరాజు ఉంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు వీళ్ళు కరెక్ట్‌గా సెట్‌ అయ్యారు.
8 భాషల్లో రిలీజ్‌
కొత్త హీరోల పైన, కొత్త వాళ్ళ పైన ఇంత బడ్జెట్‌ పెట్టడం అనేది కరెక్ట్‌ అనిపించిందా అని అందరూ అడుగుతున్నారు. సినిమా రిలీజ్‌ అయ్యాక ప్రజల గుండెల్లో రికార్డ్‌ బ్రేక్‌ మంచి సినిమాగా నిలిచిపోవాలి. అందుకోసమే ఎక్కడ రాజీ పడకుండా సినిమా తీశాం. అంతేకాదు ఈ సినిమాని ఎనిమిది భాషల్లో రిలీజ్‌ చేస్తున్నాం. అప్పట్లో నేను డైరెక్ట్‌ చేసిన హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య మంచి సినిమా విజయవాడ, వైజాగ్‌ లాంటి ప్రాంతంలో చాలా బాగా ఆడింది. అప్పుడున్న కాంపిటీషన్‌కి పెద్ద సినిమాలతో కొంతవరకు పోటీ పడలేకపోయింది. కానీ ఇప్పుడు ఇది ఖచ్చితంగా మంచి సినిమాగా నిలుస్తుంది.
క్వాలిటీ పెరిగింది
సినిమా చూసిన ప్రతివారు కూడా చాలా బాగుంది అన్నారు. ఆర్‌.నారాయణమూర్తి కూడా సినిమా చాలా అద్భుతంగా వచ్చిందన్నారు. ఈ సినిమా చూసిన విజయ నాగిరెడ్డి, రాజశ్రీ ప్రొడక్షన్స్‌ వాళ్ల సూచనతో 2.45 నిమిషాల నిడివి గల సినిమాని 20 నిమిషాలు తగ్గించాం. అలా చేయడం వల్ల సినిమా క్వాలిటీ ఇంకా పెరిగింది.
ఓ తల్లి త్యాగం చూస్తారు
బిచ్చగాడు సినిమాలో తల్లి కోసం బిడ్డ కష్టపడతాడు. కానీ ఈ సినిమాలో బిడ్డల కోసం తల్లి ఏం చేస్తుంది అనే కాన్సెప్ట్‌తో వచ్చాం. క్లైమాక్స్‌ కచ్చితంగా ఆకట్టుకుం టుంది. రెజ్లింగ్‌ కోసం చైనా వెళ్లడానికి బిడ్డలకి కష్టపడి 10 లక్షలు సంపాదించి చైనా పంపించడం, అదేవిధంగా వాళ్లకి లడ్డూలు ఇష్టమని వాళ్ళు చైనా వెళుతున్న టైంలో తన బ్లడ్‌ అమ్మి లడ్డూలు తీసుకురావడం. నా కోసం మన భారతదేశం కోసం మీరు గెలిచి రావాలి అనే సన్నివేశాలు చాలా బాగా నచ్చింది.
వార్నర్‌ బ్రదర్స్‌ కంటే..
ఈ సినిమా ద్వారా నేను డైరెక్షన్‌ నేర్చుకున్నా. ఈ సినిమా సక్సెస్‌ తరువాత మంచి టెక్నికల్‌ వాల్యూస్‌తో వార్నర్‌ బ్రదర్స్‌ తీసే సినిమా కంటే గొప్ప సినిమా తీసి చూపిస్తా. ప్రేక్షకులందరూ పాస్‌ మార్కులు ఇస్తే నా డైరెక్షన్‌లో ఇంకా మంచి సినిమాలు తీస్తాను.