పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలి

– తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర సచివాలయంలోని జీఏడీలో పని చేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యో గులకు ఈ నెల 16న నిర్వహించబోయే పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ కోరింది. ఈ మేరకు ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు జె.వెంకటేష్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్సి జె.కృష్ణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మశ్రీ, రాష్ట్ర కార్యదర్శి జె.కుమార స్వామి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సచివాలయం సాధారణ పరిపాలనా శాఖలో 100 మందికిపైగా 20 ఏండ్లుగా ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో నిబద్ధతతో పని చేస్తున్నారని తెలిపారు. ఆ సిబ్బంది అను భవాన్నే నైపుణ్యానికి ప్రామా ణికంగా పరిగణించాలని వారు విజ్ఞప్తి చేశారు.