కంటి వెలుగు పేద ప్రజలకు వరం..

– ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి
నవతెలంగాణ-దుబ్బాక రూరల్ : కంటి సమస్యలతో బాధపడుతున్న పేద ప్రజలకు సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన కంటి వెలుగు పథకం పేద ప్రజలకు వరమని దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని శిలాజి నగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని గ్రామ సర్పంచ్ మడూరి శ్రీనివాస్ తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా శిబిరంలో ఆమె కంటి పరీక్షలను చేయించుకున్నారు. అనంతరం ఎంపీపీ కొత్త పుష్పలత మాట్లాడుతూ రాష్ట్రంలో కంటి వెలుగు పథకం ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు కోటిన్నర కు పైగా ప్రజలు కంటి పరీక్షలు చేయించుకున్నారన్నారు.రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ తో కలిసి ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమన్నారు.ప్రతి ఒక్కరూ తమకున్న కంటి సమస్యల నివారణకు కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బానోత్ శంకర్ నాయక్, గ్రామ కార్యదర్శి శశి కుమార్, బీ ఆర్ ఎస్ నాయకులు మలోత్ భాస్కర్, శ్రీనివాస్ గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.