హుస్నాబాద్ డిపోలో మహిళా దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో ఆటల పోటీలు నిర్వహించారు. 2023- 24 సంవత్సరానికి గాను బెస్ట్ ఈ పీ కే  తెచ్చిన మహిళా కండక్టర్లను శాలువాతో సన్మానించారు . డిపో మేనేజర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, సూపర్డెంట్ శ్రీధర్, ట్రాఫిక్ సూపర్వైజర్ నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.
పొట్లపల్లికి ప్రత్యేక బస్సులు: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని, పొట్లపల్లి జాతరకు హుస్నాబాద్ బస్ డిపో నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ డిఎం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈనెల 8, 9 తేదీలలో పొట్లపల్లి జాతరకు 15 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నామని, పెద్దలకు 20 రూపాయలు, 10 రూపాయలు, మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ సదవకాశాన్ని భక్తులు, ప్రజలు సద్విని చేసుకోవాలని కోరారు.