బిట్స్ పాఠశాలలో ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – పరకాల

బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ లో బుధవారం రోజున ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. విద్యార్థుల మాతృమూర్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మాతృమూర్తులందరికీ పాఠశాల యాజమాన్యం ఆటల ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. ఆటపాటలతో అందరినీ అలరించారు .అనంతర పిల్లలచే పాదాభివందన కార్యక్రమం బహు చక్కగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పరకాల డివిజన్ సబ్ రిజిస్టర్ కే సునీత గారు మాట్లాడుతూ స్త్రీని దేవతగా పూజించడం విశ్వసృష్టికర్తగా సర్వోన్నత శక్తిగా ఆరాధించడం మన భారతదేశ సంప్రదాయంలో ఉంది. నేటి సమాజంలో స్త్రీలందరూ రాజకీయ విద్య వైద్య వైమానిక సైనిక రంగాలలో రాణించడం ఎంతో సంతోషకరమని తెలియజేశారు .బిట్స్ పాఠశాల యజమాన్యం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం  ఆనందంగా ఉందని అన్నారు.బిట్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ యత్ర నార్యంతు పూజ్యంతే రమ్మంతే తత్ర దేవత స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు స్త్రీలను గౌరవించాలని మనందరికీ మొదటి గురువు అమ్మని తెలియజేశారు. స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదని, గుర్తు చేశారు. కార్యక్రమంలో గెలుపొందినటువంటి వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో  బిట్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జోసెఫ్ గారు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ,విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.