కుంట్లగూడెంలో సబ్ సెంటర్ కు శంకుస్థాపన చేస్తున్న చిలుకూరి ప్రభాకర్ రెడ్డి

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం కుంట్లగూడెం గ్రామంలో 20 లక్షల రూపాయల నిధులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన బుధవారం చౌటుప్పల్ జడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి మండల పరిషత్ ఉపాధ్యక్షులు ఉప్పు భద్రయ్య నేలపట్ల ఎంపీటీసీ సభ్యురాలు తడక పారిజాతమోహన్ నేతలతో కలిసి ప్రారంభించారు. అనంతరం రూ.40 లక్షల నిధులతో గ్రామంలోని వీధులలో సిసి రోడ్ల పనులు ప్రారంభించడానికి శంకుస్థాపనలు చేశారు. చౌటుప్పల్ మండలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముమ్మురంగా జరుగుతున్నాయని చిలుకూరి ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ప్రస్తుత సింగిల్విండో చైర్మన్ చెన్నగోని అంజయ్య గౌడ్ పంచాయతీరాజ్ ఏఈ సందీప్ రెడ్డి కుంట్లగూడెం గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ పృథ్వి గ్రామపంచాయతీ సెక్రటరీ కిరణ్ సింగిల్ విండో మాజీ చైర్మన్ వెలగ రాజశేఖర్ రెడ్డి చౌటుప్పల్ మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసే నారెడ్డి చౌటుప్పల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయ దేవేందర్ కుంట్లగూడెం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ మిర్యాల పారిజాతగోపాల్ సింగిల్ విండో మాజీ డైరెక్టర్ వెలగ శ్రీధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్లకాటి రామచంద్రం,గుండు వెంకటేశం ఆశా వర్కర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.