7న నిజామాబాద్ బస్ స్టాండ్ వద్ద కాంగ్రెస్ ధర్నా

నవతెలంగాణ – కంటేశ్వర్
ఎలక్ట్రోరల్ బాండ్ పథకానికి సంబంధించిన వివరాలను సుప్రీం కోర్ట్ 06 మార్చ్ 2024 తేదీ నాటికి పూర్తి వివరాలను సమర్పించాలని చెప్పినా కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బీజేపీ యొక్క విరాళాల వివరాలను సమర్పించకుండా ఇంకా సమయం కోరడాన్ని నిరసిస్తూ, బీజేపీ ఎస్బిఐ యొక్క చీకటి ఒప్పందాన్ని ఎత్తిచూపుతూ, నిరసిస్తూ నేడు అనగా  07-03-2024 గురువారం రోజున ఉదయం 10:30 నిమిషాలకు నిజామాబాద్ బస్టాండ్ వద్ద గల ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ ముందు ధర్నా కార్యక్రమం కలదు అని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి బుధవారం ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజాంబాద్ జిల్లా కేంద్రం లోని నాయకులు కార్యకర్తలు ఉదయం 10:30 నిమిషాలకు బస్టాండ్ వద్ద గల ఎస్బిఐ బ్రాంచ్ ముందుకు రాగలరని కోరుతున్నామన్నారు.