
మండలంలో గంగమ్మ వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి బుధవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, బి ఆర్ ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి చేసిన పోరాట ఫలితమే బ్రిడ్జి నిర్మాణమని, బ్రిడ్జిని నాణ్యతతో, ప్రజలకు త్వరగా అందుబాటులోకి వచ్చేలా కాంట్రాక్టర్లు పనిచేయాలని సూచించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులను సమస్యలపై, పరీక్షల తీరుపై అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నా రెడ్డి రాజిరెడ్డి, రగోతం రెడ్డి, బండి ప్రవీణ్, కుమ్మరి శంకర్, తదితరులు ఉన్నారు.