మహిళలు అన్ని రంగాలలో రానిస్తున్నారు: ఎంపీపీ చెన్ను అనురాధ సుందర్ రెడ్డి

నవతెలంగాణ – పెద్దవూర
ప్రస్తుతం మహిళలు అన్నీ రంగాలలో రానిస్తున్నారని ఎంపీపి చెన్ను అనురాధ సుందర్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రం లోని గ్రామపంచాయతీ కార్యాలయం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా  ఎంపీపి మాట్లాడుతూ.. మహిళలు ఎదుర్కొనే సవాళ్లు, మహిళలు తమ పనిలో, గృహ జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి చాలా కష్టపడు తున్నారని అన్నారు. శక్తి, ప్రేమ, త్యాగం, ధైర్యానికి స్త్రీ నిలువెత్తు నిదర్శనమని, పురుషులతో పోలిస్తే స్త్రీలే ఎక్కువ అన్న సత్యాన్ని పునరుద్ఘాటించారు. మహిళలు ఇప్పుడు స్వయం సమృద్ధి, బాగా అవగాహన మరియు ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నారని తెలిపారు.క్రీడలు, రాజకీయాలు, ఉద్యోగం,విద్యావేత్తలు, సైన్స్‌ ఇలా ప్రతి రంగంలో, మహిళలు అపారమైన విజయాలు సాధిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మహిళా ఉద్యోగులను ఘన సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో సీడీపీఓ పద్మావతి, ఏసిడీపీఓ సువర్ణ, ప్రాథమిక పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు కుంభా పార్వతి, కస్తూరిభా గాంధీ పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.