బొమ్మలరామారం మండలం, కే కే తండ గ్రామంలో బుధవారం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొబైల్ మెడికేర్ యూనిట్ కార్యక్రమంలో 60 ఏళ్లు పైబడ్డ పెద్దలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ చల్ల జయశ్రీ వైద్య బృందం సేవలు అందించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం 54 మందికి ఉచితంగా మందులు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా కమిటీ వైస్ చైర్మన్ దిడ్డి బాలాజీ, సభ్యులు, ఎస్పీ.ఉపేందర్ రావు,ఎస్పీ.స్పందన,రేణుక,సంజీవ రెడ్డి,నరేష్,తదితరులు పాల్గొన్నారు.