ఎల్ఓసి చెక్కు అందజేత

నవతెలంగాణ -వలిగొండ రూరల్ 
రెడ్లరేపాక గ్రామానికి చెందిన జువ్వగాని రాములు గౌడ్ కి  ఇటీవల రోడ్డు ప్రమాదం  జరిగి కాలు విరిగినది. నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స కొరకు ప్రభుత్వం తరఫున మంజూరైన ఎల్ఓసి  ఒక లక్ష 50 వేల  రూపాయల చెక్కును  ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో భువనగిరి ఎమ్మెల్యే   కుంభం  అనిల్ కుమార్ రెడ్డి  చేతుల మీదుగా ఆ కుటుంబానికి బుధవారం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు,వలిగొండ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బత్తిని లింగయ్య గౌడ్, రెడ్లరేపాక మాజీ సర్పంచ్ మాద శంకర్ గౌడ్, జువ్వగాని  సుమన్ గౌడ్, ధనుంజయ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.