– పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
నవతెలంగాణ – పెద్దవంగర: విద్యార్థులు ప్రాథమిక దశ నుంచే ఉన్నత లక్ష్యాలను అలవర్చుకుని, లక్ష్యసాధనకు పట్టుదలతో ముందుకు సాగాలని ప్రధానోపాధ్యాయుడు వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని చిన్నవంగర ప్రాథమికోన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు చక్కగా పాఠ్యాంశాలు బోధించారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. ఎంఈవోగా సందీప్, ప్రధానోపాధ్యాయురాలు గా స్పూర్తి, ఉపాధ్యాయులుగా చందు, దీక్షిత్, యశ్వంత్, హారిక, స్రవంతి, నిఖిల్, వివేక్, రేవంత్ వ్యవహరించి ఆకట్టుకున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో హెచ్ఎం మాట్లాడుతూ.. పట్టుదల క్రమశిక్షణతో విద్యనభ్యసించి సమాజంలో గొప్ప పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వెంకయ్య, అజయ్, యాకుబ్ రెడ్డి, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.