ఎన్ జి ఎస్ లో అట్టహాసంగా ప్రారంభమైన వైజ్ఞానిక శాస్త్ర ప్రదర్శన

నవతెలంగాణ- కంటేశ్వర్
నగరంలోని దాస్ నగర్ గల నవ్య భారతి గ్లోబల్ పాఠశాలలు బుధవారం వైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్ ఫెయిర్) ను పాఠశాల చైర్మన్  సంతోష్ కుమార్, ప్రిన్సిపల్ శ్రీదేవిలు అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ సంతోష్ కుమార్ ప్రిన్సిపల్ శ్రీదేవిలు వైజ్ఞానిక శాస్త్ర ప్రదర్శన ఉద్దేశించి మాట్లాడుతూ నర్సరీ నుండి తొమ్మిదవ తరగతి వరకు గల విద్యార్థులు సైన్స్ ఈవీఎస్ సోషల్ మ్యాథమెటిక్స్ అంశాలలో ప్రాజెక్ట్ మోడల్స్ సుమారు 300 లకు పైగా   ప్రదర్శించారని వారు పేర్కొన్నారు. తమ పాఠశాలలో ప్రతి సంవత్సరం నిర్వహించే కల్చర్ స్పోర్ట్స్ ఈవెంట్స్ తో పాటు సైన్స్ ఫెయిర్ ను నిర్వహించడం పరిపాటిగా మారిందని తమ పాఠశాలను విద్యార్థులు ప్రతి ఒక్కరు అన్ని అంశాలలో ప్రాతినిధ్యం వహించి వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే ఉద్దేశంతో సైన్స్ ఫెయిర్ ను నిర్వహించామని వారు తెలిపారు. ఈ ప్రదర్శనను విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ వైజ్ఞానిక శాస్త్ర ప్రదర్శనను వీక్షించారు. ముఖ్యంగా నర్సరీ నుండి ప్రైమరీ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సోలార్ సిస్టం, మ్యాథమెటిక్స్ ట్రిక్స్, వైజ్ఞానిక శాస్త్ర ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి.  ఈ సైన్స్ ఫెయిర్ ప్రదర్శన రెండు రోజులు తమ పాఠశాలలో నిర్వహించనున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఆర్ లత వైస్ ప్రిన్సిపల్ సరిత ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.