త్రాగునీటి ఎద్దడి, ఇంటి పన్నుపై దృషి పెట్టండి: ఎంపీడీవో  నీలావతి 

నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
గ్రామాలలో త్రాగునీటి ఎద్దడి లేకుండా తగు చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో పెరిగిపోయిన ఇంటి పన్ను వసూల్ ల్లో డిస్టిక్ పెట్టాలని   నసురుల్లాబాద్ ఎంపీడీవో నీలావతి, ఎంపీఓ రాము గ్రామపంచాయతీ కార్యదర్శులకు సూచించారు. బుదవారం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ కార్యదర్శిలతో పాటు ఉపాధి హామీ సిబ్బందితో  సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీడీవో నీలావతి మాట్లాడుతూ మండల పరిధిలోని 17 గ్రామ పంచాయతీలో ఉన్న గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న ఇంటి పన్ను కులాయి పన్ను వసూల్లో కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, దీర్ఘకాలికంగా పన్నులు చెల్లించని వారిపై వారికి నోటీసులు ఇవ్వాలని వారు ఆదేశించారు. గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో మొక్కల పెంపకానికి కావాల్సిన సదుపాలాన్ని గ్రామ కార్యదర్శిలతో పాటు ఉపాధి హామీ సిబ్బంది స్థలాలు ఏర్పాటు చేసి వాటికి కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఆయా గ్రామాల్లో ఉన్న నర్సరీల్లో ప్రజలకు ఉపయోగపడే మొక్కలను నాటాలన్నారు. నీటి కొరత లేకుండా మొక్కలు పెరిగేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.  పంచాయతీ కార్యదర్శులతో త్రాగునీటి పై సమీక్ష నిర్వహించారు. రానున్న వేసవికాలం ని దృష్టిలో ఉంచుకొని గ్రామాలలో త్రాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. మిషన్ భగీరథ రాణి గ్రామాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలకు త్రాగునీటి ఎద్దడి లేకుండా చూడాల్సిన బాధ్యత గ్రామ కార్యదర్శి లేదని ఆమె అన్నారు. అలాగే నర్సరీల పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఎంపివో రాము వివిధ గ్రామాల కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు