బీఆర్ఎస్ పార్టీలో ప్రతి కార్యకర్త సైనికుడే: ఎర్రబెల్లి

నవతెలంగాణ – రాయపర్తి
బీఆర్ఎస్ పార్టీలో ప్రతి కార్యకర్త ఒక సైనికుడే అని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు ఏ ఒక్క కార్యకర్త అధర్యపడవలసిన అవసరం లేదని అండగా ఉండి ఆదుకుంటానని భరోసా కల్పించారు. నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రజల బాగోగులు చూసుకోవడమే తమ యొక్క అభిమతం అన్నారు. మేడిగడ్డ మూడు పిల్లర్లను చూపి రామ పాలన చేపట్టిన బిఆర్ఎస్ పార్టీపై నిందలు వేస్తున్న కాంగ్రెస్ నాయకుల కాలం కొంతకాలమే అన్నారు. ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు గడవక ముందే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారు అని తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించడం తద్యమన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మునవత్ నర్సింహా నాయక్, ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, జిల్లా పార్టీ నాయకులు గుడిపూడి గోపాల్ రావు, బిల్లా సుధీర్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, ఉపాధ్యక్షులు గబ్బేట బాబు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.