ముత్యంపేటలో చక్కెర ప్యాక్టీరిని పున:ప్రారంభిస్తాం

– తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
ముత్యంపేటలో చక్కెర ప్యాక్టీరిని పునప్రారంభిస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు అన్నారు.మంగళవారం జగిత్యాలలో మంత్రి శ్రీధర్ బాబు  విలేకరుల సమావేశంలో మాట్లాడారు ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని పున:ప్రారంభిస్తామని -రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం తోనే చక్కెర ఫ్యాక్టరీ మూతపడిందన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీనిలన్ని ఖచ్ఛితంగా అమలు చేస్తామన్నారు.బిఆర్ఎస్,బిజెపి ఆసత్యపు ప్రచారాలు ప్రజలు నమ్మద్దంన్నారు.హామీ ఇచ్చిన వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు.