నవతెలంగాణ – శాయంపేట
మండలంలోని పెద్దకోడపాక గ్రామానికి చెందిన కోమనేని రఘును తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, హనుమకొండ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్‌గా నియమించినట్లు తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫౌండర్, ప్రెసిడెంట్, చైర్మన్ చింతపట్ల వెంకటాచారి ప్రకటించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని బుధవారం జారీచేశారు. రఘు యొక్క అద్భుతమైన అర్హతలు, అనుభవం గుర్తించి నియమించినట్లు తెలిపారు. జిల్లా చీఫ్ కోఆర్డినేటర్‌గా, మిస్టర్ రఘు సంఘంలో అత్యుత్తమ విజయాలను గుర్తించడంలో, రికార్డ్స్ సెర్చ్ టీమ్‌కు నాయకత్వం వహించనున్నట్లు తెలిపారు. ఆయన నియామకం వివిధ రంగాలలో నిష్ణాతులను గుర్తించాలనే మా నిబద్ధతను ప్రతిబింబిస్తుందని, మార్చి 06, 2024 నుండి మూడు నెలల ప్రొబేషనరీ పీరియడ్, మార్చి 06, 2027 వరకు పొడిగించబడుతుందని నియామక ఉత్తర్వులో తెలిపారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ గా రఘు నియామకం కావడంతో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అభినందించారు.