నెక్సస్ హైదరాబాద్ మాల్‌లో మహిళా దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – హైదరాబాద్: నెక్సస్ హైదరాబాద్ మాల్‌లో ఈనెల 8, 9, 10వ తేదీలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. నెక్సస్ హైదరాబాద్ మాల్ ప్రత్యేక సందర్భాలలో తమ కస్టమర్లకు ప్రత్యేక అనుభవాన్ని అందించడానికి ఈవెంట్‌లు, ఆన్-గ్రౌండ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాల్‌కు వచ్చే మహిళలందరికీ పూలతో స్వాగతం పలుకుతారు. మహిళల కోసం ప్రత్యేకమైన, ఉత్తేజకరమైన డీల్‌లను అందిస్తుంది. మాల్‌లో మార్చి 8వ తేదీ ఉదయం 11 గంటల నుంచి సిమ్సమ్ ఆర్ట్స్ సహకారంతో మహిళా కళాకారులతో లైవ్ ఆర్ట్ షో ఉంటుంది. ‌ఈ ఆర్ట్ షోలో ప్రేక్షకులు యాక్రిలిక్ పెయింటింగ్, డాట్ మాండలా, గౌచే పెయింటింగ్, సాఫ్ట్ పాస్టల్స్, ఆయిల్ పాస్టల్స్, కలర్ పెన్సిల్స్, కాన్వాస్ ఆర్ట్స్, బొగ్గుతో సహా వివిధ రకాల కళలలో తమను తాము నిమగ్నం చేసుకోవచ్చు. బ్రాండ్ విలువలకు కట్టుబడి, లైవ్ ఆర్ట్ షో, నవ్ యోగా సహకారంతో మార్చి 9వ తేదీన ఫ్లాష్ యోగా సెషన్‌ ఉంటుంది. యోగా, శాస్త్రీయ నృత్యాల కలయికతో మహిళల దైనందిన జీవితంలో యోగా ప్రయోజనాలపై అవగాహన పెంచడానికి ఉద్దేశించబడింది. మాల్‌లో వివిధ వర్క్‌షాప్‌లు, లైవ్ ఆర్ట్ వేలం పాటలు, జానపద నృత్య ప్రదర్శనలు, జుంబా డ్యాన్స్ సెషన్ కలదు. మహిళలు వివిధ కార్యకలాపాలలో పాల్గొనడానికి, షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరచుకోవడానికి వీలు కల్పిస్తాయి. దుకాణదారులు కూడా ప్రత్యేక తగ్గింపులు ఇస్తారు. 2ఎక్స్ రివార్డ్‌లను పొందే అవకాశం, బహుమతి ఓచర్‌లను గెలుచుకునే అవకాశాన్ని అందిస్తారు.