ఇటలీలో కల్కి పాట

ఇటలీలో కల్కి పాటప్రభాస్‌, డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ క్రేజీ కాంబినేష్‌లో రూపొందుతున్న ప్యూచరిస్ట్‌ సైన్స్‌ ఫిక్షన్‌ గ్లోబల్‌ ఫిల్మ్‌ ‘కల్కి 2898 ఎడి’. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం అద్భుతమైన సినిమా అనుభవాన్ని అందించబోతుంది. తాజాగా చిత్ర యూనిట్‌ సాంగ్‌ షూటింగ్‌ కోసం ఇటలీ వెళ్ళింది. ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌, దిశా పటానీతో పాటు యూనిట్‌ అంతా కలిసి దిగిన ఫోటోని ఈ సందర్భంగా మేకర్స్‌ షేర్‌ చేశారు. ఇటలీలోని అద్భుతమైన లోకేషన్స్‌లో ఈ పాటని చాలా గ్రాండియర్‌ చిత్రీకరించనున్నారు. ఈ సినిమా గత సంవత్సరం శాన్‌ డియాగో కామిక్‌-కాన్‌లో సంచలనం సష్టించింది. టీజర్‌ గ్లింప్స్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను పొందింది. వైజయంతీ మూవీస్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మైథాలజీ ఇన్స్పైర్డ్‌ ప్యూచరిస్ట్‌ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రంగా ప్రేక్షకులకు దశ్యకావ్యాన్ని అందించబోతుంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా విడుదల కానుంది.