
– అవగాహన పెంచుకుంటేనే ప్రయోజనం
– రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
నవతెలంగాణ – మల్హర్ రావు
మహిళల రక్షణకు ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.వేధింపులు,హత్యలు,అఘాయిత్యాలను అరికట్టేందుకు అనేక కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు. కొందరు వీటి గురించి అవగాహన కలిగి వినియోగించుకుంటున్నారు. మరికొందరు అన్యాయం జరిగినా మిన్నకుండిపోతున్నారు.షి బృందాలు ఏర్పాటు చేసిన సమయం నుంచి వేధింపుల విషయంలో పూర్తిస్థాయిలో అవగాహన వచ్చింది. ఆకతాయిలు సైతం మహిళలను ఇబ్బందులు కలిగించే వ్యవహారాలు కొంతమేర తగ్గాయి. దంపతుల మధ్య వస్తున్న చిన్న వివాదాలను కౌన్సెలింగ్ చేసి పోలీస్ అధికారులు పరిష్కరిస్తున్నారు. రాజీకి ఒప్పుకొని వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.నేడు మహిళ దినోత్సవం నేపథ్యంలో మహిళలకు ఉన్న అతిముఖ్యమైన చట్టాలపై నవ తెలంగాణ ప్రత్యేక కథనం.
పోక్సో..బాలికలపై జరిగే లైంగిక వేధింపులు తగ్గించడానికి పొక్సో చట్టాన్ని ప్రత్యేకంగా రూపొందించారు.ఈ చట్టం వారిని ఏరకంగా ఇబ్బందులకు గురిచేసినా, ప్రలోభ పెట్టిన తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది.18 సంవత్సరాల లోపు వారిని మాటలతో వేధించి వారిలో అభద్రతా భావాన్ని కలిగించినా ఈ చట్టం పరిధిలో కేసు నమోదు చేసేందుకు అవకాశం ఉంది.18 సంవత్సరాలలోపు బాలికలకు ప్రేమ పేరుతో యువకులు తమతో తీసుకెళ్లడం, పెళ్లి చేసుకోవడం నెరమవుతుంది వారి ఇష్టప్రకారం వివాహం చేసుకున్న చట్ట ప్రకారం నేరం చేసినట్లుగా అవుతుంది.పిర్యాదు నమోదైన ఏడాది లోపులోనే కేసు పూర్తి చేయాలనే నిబంధన ఉండడంతో సత్సర విచారణతోపాటు పరిశోధన వివరాలు న్యాయస్థానం ఎదుట పెట్టేందుకు అవకాశం ఉంది.
శిక్షలు..ఆకతాయిలు ఎవరైనా బాలికలను శారీరకంగా, మానసికంగా వేధించే వారికి ఈ చట్టం ద్వారా నెలన్నరకు తక్కువ కాకుండా రిమాండ్ లో ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి నేరాలకు చట్ట ప్రకారం నెరస్థాయిని బట్టి ఆరు నెలల నుంచి ఏడేళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదీ విధించేందుకు అవకాశం ఉంది.
బాల్య వివాహాలు..మగవారికి 21,ఆడవారికి 18 సంవత్సరాలు నిండిన తరువాతే వివాహాలు చేయాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ వయస్సులో వివాహాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది. దగ్గర ఉండి వివాహం చేసిన తల్లిదండ్రులు, బంధువులపై సైతం కేసులు చేసే అవకాశం ఉంటుంది.
శిక్షలు.. బాల్య వివాహాల కేసుల్లో మూడు నెలల నుంచి ఏడాది పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. దీంతోపాటు జరిణామాలు కూడా ఒక్కోసారి విధిస్తారు.పెళ్లిళ్లు చేసున ఖాజ్, పురోహితులు,పాస్టర్లపై సైతం కేసులు నమోదు చేసేందుకు అవకాశం ఉంది.
వరకట్న వేధింపులు..కట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరమని 1961లో చట్టం తీసుకొచ్చారు.చట్టానికి అవసరమైన మార్పులను 1984-86లో నిర్వహించారు.దీంతోపాటు వరకట్న చావులపై కఠిన చట్టాలు ఉన్నాయి.కట్నం గురించి వేధించడం,బాధితురాలు ఆత్మహత్య చేసుకునేందుకు కుటుంబ సభ్యులు కారణం అని తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది.
శిక్షలు.. వరకట్నం తీసుకున్నట్లుగా రుజువైతే నేరస్తులకు ఐదు సంవత్సరాలపాటు తక్కువ కాకుండా కారాగార శిక్ష రూ.15 వేలకు తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు.వరకట్న వేధింపులు రుజువైతే ఏడూ సంవత్సరాలకు తక్కువ కాకుండా జైలు శిక్ష లేదా కేసు తీవ్రతను బట్టి జీవితఖైదీ విధించే అవకాశం ఉంది.
గృహహింస చట్టం ..వేధింపులకు గురవుతున్న మహిళలకు రక్షణ కోసం ప్రభుత్వం గృహహింస చట్టాన్ని తీసుకొచ్చింది.పార్లమెంట్ 2005లో ఆమోదం తెలిపింది.బాధితులు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్ వాడి కేంద్రంలో పిర్యాదు వస్తే బాధితుల ఆరోపణలు వచ్చిన వారిపై పిలిచి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.అప్పటికి వారు రాజీకి రాకపోతే నేరుగా కౌన్సిలింగ్ నిర్వహించిన న్యాయవాదులే న్యాయస్థానాల్లో కేసులు నమోదు చేస్తారు.అరవై రోజుల్లో కేసును పరిష్కరించాల్సి ఉంటుంది.న్యాయమూర్తి ఇచ్చిన రక్షణ ఉత్తర్వులను ఉల్లంఘించినట్లైతే ప్రతివాడికి ఏడాది జైలు శిక్ష,రూ.25 వేల వరకు జరిమాన విధించే అవకాశం ఉంది.
నిర్భయ శిక్షలు..మహిళలపై లైoగిక దాడులు,వేధింపులు,అత్యాచారాలకు పాల్పడే వారికి ఇది వరకు సాధారణ శిక్షలు మాత్రమే పదేవి.ఢిల్లీలో నిర్భయ నిర్భయ ఘటన తరువాత చట్టంలో చాలా మార్పులు తీసుకొచ్చారు.2013 చట్టంలో మార్పులు తీసుకొచ్చారు.
శిక్షలు..326(ఏ), 326(బి), 354 (ఏ),354( బి),354 (సి), 354 (డి) శిక్షల్లో మార్పులు తీసుకొచ్చారు.326 (ఏ)లో పదేళ్లకు తక్కువ కాకుండా శిక్ష తీవ్రతను బట్టి యావజ్జివ శిక్ష విధించేందుకు అవకాశం ఉంది.బాధితురాలికి ఆసుపత్రి ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది.మిగతా సెక్షన్ లో ఒక సంవత్సరం నుంచి ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్షలు విధించేందుకు అవకాశం ఉంది.
అబార్షన్ సంబంధ కేసులు.. గర్భస్రావం చేయించడం చట్ట ప్రకారం నేరం.ఇలా చేయిస్తే రెండు సంవత్సరాలు మించి జీవితఖైది వరకు శిక్షలు విధించే అవకాశం ఉంది.దీంతోపాటు జరిమానాలు సైతం న్యాయమూర్తులు విధిస్తారు.ముందస్తుగా నిర్దారణ చేస్తే తల్లిదండ్రులు, బంధువులు,పరీక్ష నిర్వహించిన వైద్యులు శిక్షర్హులు అవుతారు.ఈ చట్టం కింద ఐదు సంవత్సరాలు జైలు శిక్ష పది వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.