విద్యార్థులకు పరీక్ష అట్టలు అందజేత..

నవతెలంగాణ – నాగిరెడ్డి పెట్

నాగిరెడ్డిపేట మండలంలోని ఆత్మకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు అందజేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జబీన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మకూర్ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేసినట్లు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో వారి వెంట పాఠశాల ఉపాధ్యాయులు అరవింద్ ఉన్నారు.