నకిలీ పట్టా పాస్ పుస్తకాలతో బ్యాంకులో రుణాలు

– బ్యాంకు అధికారులతో వాగ్వివాదానికి దిగిన రైతులు…

నవతెలంగాణ – రెంజల్
గత 50 సంవత్సరాలుగా పంటలు పండించుకుంటూ, కబ్జాలోనున్న రైతులను కాదని, నకిలీ పట్టా పాస్ పుస్తకాలను సృష్టించి లక్షల రూపాయలను డ్రా చేసిన ఉద్దాంతం వెలుగులోకి వచ్చింది . బ్యాంకు మేనేజర్ సంతోష్ గురువారం అట్టి భూమిని స్వాధీనం చేసుకోవడానికి రాగా రైతులు అడ్డుకున్నారు. 23 మంది రైతుల భూములపై నకిలీ పట్టా పాస్ పుస్తకాలతో రుణాలను కాజేసిన వ్యక్తికి బ్యాంకు అధికారులు పలుమార్లు నోటీసులు అందజేసిన అతను బ్యాంకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, దీంతో అట్టి భూములను సర్వే చేయించడానికి సర్వేయర్ తో రాగా రైతులు అడ్డుకున్నారు. తమ సర్వే నంబర్ల పక్కనే పి వన్, పి టు, చేర్చి తనకు అక్కడ భూమి ఉన్నట్లు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై నకిలీ పట్టా పాస్ పుస్తకాలను తీశారని రైతులు ఆరోపిస్తున్నారు. 2012 13 లో ముషీరఫ్ జమ, సుల్తానా బేగం, సఫియా బేగం, పేర్లతో అట్టి భూమి సర్వే నెంబర్ లపై పి1 పి2 సృష్టించి, నకిలీ పట్టా పాస్ పుస్తకాలను రెవెన్యూ శాఖ ఇవ్వడంతో వాటిపై బ్యాంకులో లక్షల రూపాయల రుణాలను తీసుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇట్టి నకిలీ పట్టా పాస్ పుస్తకాలపై రెవెన్యూ శాఖ ఉన్నత అధికారులతో సమగ్ర సర్వే జరిపించి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సుమారు 50 మంది రైతులు తమ సంతకాలతో బ్యాంకు మేనేజర్ తో పాటు సర్వేయర్ కు లిఖితపూర్వకంగా అందజేయడంతో అధికారులు తిరిగి వెళ్లారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు జగదీష్ ధనుంజయ, గంగరాజు నాని, మహేష్ , బుదయ్య, సత్తయ్య, మరో 50 మంది రైతులు ఉన్నారు.