– ఖమ్మం సభకు భారీగా తరలివెళ్లిన కాపులు
నవతెలంగాణ – నెల్లికుదురు
మున్నూరు కాపుల హక్కులకై పోరాడుతుంది రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అని ఆ సంఘం జిల్లా కోశాధికారి యాసం రమేష్,మండల ప్రధాన కార్యదర్శి పాశం రమేష్ అన్నారు. గురువారం ఖమ్మం పట్టణంలో రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర ఆశీర్వాద సభకు భారీగా వెళ్లే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాహన శ్రేణిని ని ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణలో మున్నూరు కాపులను గుర్తించి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రవిచంద్రను గుర్తించి ఎన్నుకున్నందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కు కృతజ్ఞతలు తెలిపారు. జాతి ప్రయోజనాలు, హక్కులకై పోరాడుతూ నిత్యం పరితపిస్తున్న రవిచంద్ర మరింత జాతీయస్థాయిలో ఉన్నత స్థాయికి ఎదిగి పోరాటాలను నిర్వహించాలని కోరారు. ఆశీర్వాద సభకు తరలివచ్చిన సంఘ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి శ్రీనివాస్, బండి సోమయ్య, కనకం కృష్ణయ్య, యాసం వెంకటేశ్వర్లు, పాశం అశోక్, బొల్లం సోమయ్య, ఆకుతోట సోమయ్య, కొంతం అశోక్, గాండ్ల ఉప్పలయ్య, యాసం వెంకన్నతో పాటు ఆయా గ్రామాల నుండి అధిక సంఖ్యలో పాల్గొన్నారు.