ఉన్నత విద్యారంగా అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: ఎస్ఎఫ్ఐ డిమాండ్

నవతెలంగాణ  – కంటేశ్వర్
ఉన్నత విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం భారత విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 9, 10వ తేదీ లలో తెలంగాణ యూనివర్సిటీలో జరిగే రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్ సందర్భంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యరంగం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశం పైన ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కార్యదర్శి పోషమైన మహేష్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐటిఐ రిటైర్డ్ ప్రిన్సిపల్ రామ్మోహన్రావు  పాల్గొని,ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విద్యారంగా పరిస్థితి పై అనేక విషయాలను సూచనలు, సలహాలు తెలియజేయడం జరిగింది అని అన్నారు. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోడ అనిల్ మాట్లాడుతూ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో ఉన్న సమస్యల పరిష్కారం కొరకు ఈనెల 9,10వ తేదీలో రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్ తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించడం జరుగుతుందని ఈ కన్వెన్షన్ సందర్భంగా విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం కార్యచరణ రూపొందించుకోవడం జరుగుతుందని అన్నారు. అలాగే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన వామపక్ష విద్యార్థి(పిడిఎస్యు, ఏఐఎస్ఎఫ్, పిడిఎస్యు) సంఘ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కొరత, మౌలిక సదుపాయాల కల్పన లేదని, అలాగే కొన్ని యూనివర్సిటిలలో కనీసం విసీ కూడా లేకుండా పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారయిందని,ఇలాంటి సమస్యల పరిష్కారం కొరకు భవిష్యత్తులో  కలిసికట్టుగా ముందుకు వస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం, పిడిఎస్యు  జిల్లా ప్రధాన కార్యదర్శి కర్కే గణేష్, పిడిఎస్యు ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్  ఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు దీపిక, వేణు ఎస్ఎఫ్ఐ హాస్టల్ కమిటీ నాయకులు శ్రీహరి పిడిఎస్యు జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్ తదితరులు పాల్గొన్నారు.