ఓవర్ స్పీడుతో ఇసుక అక్రమ రవాణా

– రోడ్డుపైకి రావాలంటే వణుకుతున్న స్థానికులు
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం పరిధిలో దుందుభి పరివాహక ప్రాంతంలో పెద్దాపురం, మొల్గర నుంచి ఇసుక రవాణా జోరుగా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. భారీ టిప్పర్, ట్రాక్టర్లు సహాయంతో అచ్చంపేట ఇతర మండలాలకు టన్నులకొద్దీ మండల కేంద్రంలో ఓవర్ స్పీడ్, దుమ్ము ధూళి వాహనాల శబ్దాలతో మోత మోగుతోంది రోడ్డు ఇరువైపులా ఉన్న ఇండ్లు షాపు యజమానులకు ఇబ్బందులు ఎదుర్కోక తప్పట్లేదు భరించి విసుగెత్తిన మండల కేంద్ర స్థానిక ప్రజలు ఒక్కసారిగా టిప్పర్లను డక్టర్లను కేంద్రంలో రోడ్డుపై అడ్డుకున్నారు. గంటసేపు వాహనాలను నిలిపి ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న వాహనాలను కట్టడి చేసేది ఎవరని సమస్య పరిష్కారమయ్యే వరకు పోవద్దంటూ రోడ్డుపై వాహన డ్రైవర్లను నిలిపివేశారు. పోలీసు సిబ్బందికి ఇసుక వాహనాలు నిలిపివేసినట్లు సమాచారం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతామని స్థానిక ప్రజలకు పోలీసులు హామీ ఇవ్వడంతో పోలీసుల మాటకు కట్టుబడి ఉంటామని అడ్డుకున్న స్థానికులు పక్కకు జరిగారు ఇసుక రవాణా వాహనాలు నెమ్మదిగా వెళ్తూ కాస్త దూరంగా వెళ్ళగానే మళ్లీ రై రై అని ఊపందుకున్నాయి.