
నవతెలంగాణ – అశ్వారావుపేట
గిరిజనుల సమగ్రాభివృద్ధికి పాటు పడుతూ,వారి వ్యవసాయ భూములకు సాగునీరు అందించేందుకు ఊరూరా బోరు వేయడం,దానికి విద్యుత్ సరఫరా చేయించడం ద్వారా విశేష కృషి చేస్తున్న జలగం వెంగళరావు చారిటబుల్ ట్రస్టు (జే.వీ.ఆర్) నిర్వాహకుడు మాజీ మంత్రి జలగం ప్రసాద్ రావు ఈ ప్రాంతం పేద గిరిజన రైతాంగానికి అభినవ భగీరథుడు అని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. గురువారం మండలంలోని నెమలి పేట కి చెందిన చెందిన 52 మంది గిరిజన రైతులకు రూ.33 లక్షల విలువైన ఎలక్ట్రికల్ పంపు సెట్లు,స్టార్టర్లను జేవీఆర్ ట్రస్టు ద్వారా అందించారు.ఈ మోటార్లు ను మాజీ మంత్రి జలగం ప్రసాదరావు తో కలిసి ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనుల సాగు భూములకు సాగునీరు అందకపోవడంతో ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, వర్షాధారం తో పంటలను సాగు చేసి నష్టాల పాలౌతున్నారని అన్నారు.ఈ పరిస్థితి తెలుసుకొని జేవీఆర్ ట్రస్టు నిర్వహకులు మాజీ మంత్రి జలగం ప్రసాద్ రావు గిరిజన రైతులకు ఎంతో శ్రమతో కూడిన విద్యుత్ సౌకర్యం, మోటార్లను ట్రస్టు ద్వారా అందించడం సంతోషమని అన్నారు.ఇప్పటికే నియోజకవర్గంలోని వందల మంది గిరిజన రైతులకు ఈ ట్రస్టు ద్వారా అందించారని, ఇలాంటి సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ గిరిజన పొలాలకు సాగునీరు అందించి, వారంతా ఆర్థికంగా బలోపేతం కావడమే ట్రస్టు లక్ష్యమని అన్నారు.గిరిజన రైతులకు సేవలు అందించడం తన అదృష్టమని,రానున్న రోజుల్లో ఈ సేవలను విస్తరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ ప్రసాద్,ఎన్పీడీసీఎల్ ఏడీ బి.వెంకటేశ్వర్లు,అశ్వారావుపేట ,వినాయక పురం పీఎసీఎస్ ల అద్యక్షలు చిన్నంశెట్టి సత్యనారాయణ,నిర్మల పుల్లారావు,కార్యదర్శి మహేశ్వరి, కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్,మొగళ్లపు చెన్నకేశవరావు, జూపల్లి ప్రమోద్, బీఆర్ఎస్ నాయకులు కోటగిరి సీతారామస్వామి, రైతులు పాల్గొన్నారు.
కళాశాల పోస్టర్లు ఆవిష్కరణ: మండలంలోని నెమలిపేట లో గురువారం జరిగిన కార్యక్రమంలో పెదవాగు ప్రాజెక్టు సమీపంలో ఉన్న తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రవేశ పరీక్షల ప్రచార పోస్టర్లను మాజీ మంత్రి జలగం ప్రసాద్‌రావు, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతుల ‘ మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం ఈ నెల 28వ తేదిన జరిగే ప్రవేశ పరీక్షను అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల బి రోజా, కళాశాల సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.