గ్రామ పంచాయతీ కార్యాలయంలో బైఠాయించిన మాజీ సర్పంచ్‌ నిరసన

నవతెలంగాణ – ముత్తారం
ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో తాజా మాజీ సర్పంచ్‌ సముద్రాల వాణి రమేష్‌ గురువారం బైఠాయించి నిరసన తెలిపారు. గతంలో సర్పంచ్‌ హోదాలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు చెల్లింపు చేయడం లేదని వారు తమ ఆవేదనను వెల్లబుచ్చారు. గ్రామ సెక్రటరీ, స్పెషల్‌ ఆఫీసర్‌ వ్యవహారంతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.