
నవతెలంగాణ -తాడ్వాయి
అభివృద్ధి కోసం మండల ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్ చేసిన సేవలు మరువలేనివని మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ ఉద్యోగులు కొనియాడారు. గురువారం బదిలీపై వెళ్లిన ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్ కు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మొదట ఎంపీడీవో ఆంజనేయ ప్రసాద్ కు శాల్వాలు కప్పి, బొకే లు అందించి ఘనంగా సన్మానించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యాంజనేయ ప్రసాద్ మండల అభివృద్ధికి విశేష సేవ అందించి, ఉత్తమ అధికారిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలందరికీ అందించడంలో గడపగడపకు ప్రభుత్వం ద్వారా అభివృద్ధి సేవలను వేగవంతం చేయడంలో సత్యాంజనేయ ప్రసాద్ చేసిన కృషి మరువలేనిదని అన్నారు. బదిలీపై వెళ్లిన ప్రదేశంలో కూడా ఆయన మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షాలు. ఈ క్రమంలో పంచాయతీ కార్యదర్శులు భార్గవ్, శ్రావణ్, మధు, కోరం భాగ్యరాణి, ధర్మేందర్, కొర్నేబెల్లి సతీష్, రమేష్, ఆనంద్, మొదలగు 18 గ్రామ పంచాయతీల కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్లు ఊకె ప్రసాద్, ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.