మహాధర్నాకు తరలిన వీఓఏలు

నవతెలంగాణ-ఆమనగల్‌
సీఐటీయూ ఆధ్వర్యంలో వీఓఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఇందిరా పార్క్‌ వద్ద నిర్వహించిన మహాధర్నాలో పాల్గొనేందుకు కడ్తాల్‌ మండల కేంద్రం నుంచి సీఐటీయూ ఆధ్వర్యంలో వీఓఏలు వివిధ వాహనాల్లో హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు గుమ్మడి కురుమయ్య మాట్లాడుతూ 45 రోజులుగా వీఓఏలు నిరవధిక సమ్మెలో పాల్గొంటు వివిధ రుపాల్లో నిరసన నిరహార దీక్షలు చేపడుతున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 9 సంవత్సరాలుగా వెట్టిచాకిరి చేస్తున్న వీఓఏలను ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే నిరసన దీక్షలను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. వీఓఏల సంఘం మండల అధ్యక్షులు జానకి రాములు ఆధ్వర్యంలో శైలజ, వనిత, విజయ, కృష్ణవేణి, శోభ, అనసూయ, కవిత, సుమన్‌ నాయక్‌, జంగయ్య, బాలరాజు, చత్రు తదితరులు ఇందిరా పార్క్‌ మహా ధర్నాకు తరలి వెళ్లారు.