– శ్రీ రామాకోటేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎంఎల్సీ తేరా చిన్నపరెడ్డి
– భక్తులతో శోభాయమానంగా ఆలయప్రాంగణం
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం పినవూర గ్రామం లో తిరుమల నాథ స్వామి చెరువు ప్రక్కన ప్రకృతి అందాల నడుమ ఆహ్లాధకరమైన వాతావరణం లో వున్న శ్రీ రామ కోటేశ్వరి స్వామి శివాలయం లో పినవూర గ్రామానికి చెందిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎంఎల్ సీ తేర చిన్నపరెడ్డి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.పురోహితులు పులి రోహిత్ శర్మ, కాటేపల్లి నర్సింహిమ్మ శర్మ, వేధబ్రాహ్మణుల మంత్రోచ్చారణల మధ్య భక్తుల అధ్యాత్మిక శోభ తో సంతరించుకుంది. ఈసందర్బంగా తేరా చిన్నపరెడ్డి మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి పర్వదినాన్నిపురస్కరించుకొని రాష్ట్ర ప్రజలు, ఉమ్మడీ నల్గొండ జిల్లా, సాగర్ నియోజకవర్గం ప్రజలు భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక భావనతో భక్తులు ఉపవాసం ఉండి పవిత్రంగా జరుపుకుంటారన్నారు. పరమేశ్వరుని అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.