కాంగ్రెస్ లో పలువురి చేరిక..

నవతెలంగాణ – డిచ్ పల్లి

ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన డిచ్ పల్లి మండలం లోని రాంపూర్ డి సహకార సొసైటీ డైరెక్టర్ బోక్క గంగాధర్, బీఅర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి మురళి గౌడ్ తోపాటు తదితరులు బీఅర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సమక్షంలో మాజీ ఎంపిటిసి చింతల కిషన్ అధ్వర్యంలో చేరారు.చేరినవారందరికి కాంగ్రెస్ పార్టీ కండువా వేసి అహ్వానించిచారు. త్వరలోనే జరిగే ఎంపి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు ప్రత్యేక కృషి చేస్తామని వారన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను మూడు నెలల కాక ముందే అమలు చేశారని, రాష్ట్రంలో చేస్తున్న అబివృద్ధికి ఆకర్షితులై చేరినట్లు వారన్నారు.ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, సినియర్ నాయకులు బోర్వెల్ రాజేందర్ రెడ్డి తో పాటు తదితరులు ఉన్నారు.