రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుంది: మంత్రి

నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎప్పుడు అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. ఈ సందర్భంగా మహాశివరాత్రి సందర్భంగా పలు ఆలయాల్లో పూజలు నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో వర్షాలు పడకపోవడం వల్ల ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య రాకూడదని ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. బ్యారేజీల విషయంలో తాము సాంకేతిక నిపుణలము కాదని, సాంకేతిక నిపుణులు మేడిగడ్డ,అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు పరిశీలించిన అనంతరం చేసే సూచనలకు అనుగుణంగా  ముందుకు వెళ్తామని చెప్పారు. రైతులకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు.అనంతరం మంథని డిపోను సందర్శించి కార్మికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.శివరాత్రి సందర్భంగా వేలాల జాతరకు మంథని డిపో నుండి భక్తుల కోసం ఆర్టీసీ బస్సును ప్రారంభించారు.