ఘనంగా శివరాత్రి మహోత్సవ ఉత్సవాలు

– కృష్ణాజివాడిలో పూజలు చేస్తున్న భక్తులు
– సంతాయిపేట శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో పూజల కోసం వరుసలో నిలిచిన భక్తులు
– పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
నవతెలంగాణ – తాడ్వాయి 
 తాడ్వాయి మండలం లో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మండలంలోని సంతాయిపేట శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకుని పునీతులు అయ్యారు తాడువాయి మండలంలోని భక్తులే కాకుండా చుట్టుపక్కల మండలాలు అయిన లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట ,మెదక్, కామారెడ్డి గాంధారి, సదాశివ నగర్ మండలాలకు చెందిన భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని తాకుతూ ఉత్తరం నుంచి దక్షిణ వైపు కు వాగు ప్రవహిస్తుండడంతో ఈ వాగులో పుణ్యస్నానాలు చేస్తే ప్రత్యేక పుణ్యం దొరుకుతుందని భక్తులు భావిస్తారు.అందుకోసం ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య, శివరాత్రి పర్వదినాలలో భక్తులు ప్రత్యేకంగా తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ స్వామివారిని దర్శించుకుంటారు
దట్టమైన అరణ్యంలో వెలసిన స్వామి: సంతాయిపేట శివారులో ఘట్టమైన అరణ్యంలో శ్రీ భీమేశ్వర స్వామి కొలువుదీరాడు గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ స్వామివారి ఆలయానికి వెళ్లడం కోసం కామారెడ్డి ఆర్టీసీ డిపో వారు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు మండలంలోని కృష్ణాజివాడి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు నిర్వహించారు చిట్యాల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ,దేమికలాన్ లోని శ్రీ పార్వతి దేవి ఆలయంలో ,తాడ్వాయి లోని శ్రీ శబరిమాత ఆలయంలో శివరాత్రి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి, గ్రామ పెద్దలు శ్రీనివాస్, కృష్ణమూర్తి ,రాజేశ్వరరావు ,రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.