నవతెలంగాణ – రెంజల్
తెలంగాణ రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి జరగాలంటే విద్యార్థులలో ఉండే సృజనాత్మకత ను వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, విద్య పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిన ని మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం రెంజల్ మండల కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల నూతన భవనాన్ని సీఎం చేతుల మీదుగా లాంచింగ్ చేశారు. 18 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భవనాన్ని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెంజల్ మండలంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఐదో తరగతి నుండి ఇంటర్ వరకు ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాన్ని బోధిస్తున్నారని, ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బోధించాలని ఆయన సూచించారు. ఆయన బాలికలతో ముచ్చటిస్తూ విద్యాబోధన, గ్రేడ్లు ఎలా వస్తున్నాయని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు పాఠశాలలలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి కోటి 50 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని, అవసరమైతే మరోకోటి రూపాయలను కేటాయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యాబోధనతో పాటు వారికి పౌష్టికమైన ఆహారం అందించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే వారిని తొలగిస్తామని హెచ్చరించారు. విద్యతో పటు, కంప్యూటర్, కుట్టు మిషన్లలో ఆసక్తి కలిగిన విద్యార్థుల కోసం 25 కంప్యూటర్లను అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంతు బోధన్ ఆర్డీవో రాజా గౌడ్, జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు, ఉర్దూ అక్కడ మీ చైర్మన్ తాహర్బిఅందన్, జడ్పీ వైస్ చైర్మన్, జెడ్పిటిసి మేక విజయ సంతోష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొబిన్ ఖాన్, మైనార్టీ వెల్ఫేర్ అధికారి కృష్ణవేణి, ఆర్ ,సి, ఓ, బషీర్, తాసిల్దార్ ఎండి కలీం, స్థానిక నాయకులు జావిద్, సాయి రెడ్డి, గియాసుదన్, బాబు, సిహెచ్ రాములు, షౌకత్, బన్సియా, ఎమ్మెస్ రమేష్ కుమార్, కురుమే శ్రీనివాస్, సాయిబాబా గౌడ్, గంగా గౌడ్, గంగా కిషన్, నరసయ్య, యువజన నాయకులు కార్తీక్, మాజీ ఎంపీటీసీ సవిత రవి, గైని కిరణ్, సయ్యద్ సల్మాన్, సోక్కుల సాయిలు, ఫుర్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.