నారీ శక్తి ఫిట్ నెస్ డే విజయవంతం…

– మహిళా సంఘాల సభ్యులకు పరుగు పందెం నిర్వహణ…
నవతెలంగాణ – అశ్వారావుపేట
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని కేంద్రం ప్రభుత్వం ఆదేశాల మేరకు భారతదేశ వ్యాప్తంగా నిర్వహించిన నారీ శక్తి ఫిట్ నెస్ డే ను సెర్ప్ అశ్వారావుపేట మండల శాఖ విభాగం బాధ్యులు ఎ.వెంకటేశ్వరరెడ్డి నేతృత్వంలో శనివారం  విజయవంతంగా నిర్వహించారు. ఈ మార్చి 8 ప్రపంచ మహిళా దినోత్సవాన్ని కేంద్రప్రభుత్వం నారీ శక్తి ఫిట్ నెస్ డే గా ప్రకటించింది.అయితే శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించి నందున ఆ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో క్రీడా ప్రాంగణంలో మహిళా సంఘాల సభ్యులకు 500 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు.ఇందులో సెల్ఫ్ వి.ఒ.ఎ లు,స్వయం సహాయక మహిళా సమాఖ్య ల సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని సి.సి లు సత్తిబాబు,సత్యనారాయణ,అరుణ లు పర్యవేక్షించారు.